ప్రభాస్ పై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది : మాళవిక మోహనన్

ప్రభాస్ పై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది : మాళవిక మోహనన్
X
ప్రభాస్ సర్‌ని కలవడానికి ముందు, ఆయన ఇంటర్వ్యూలు చూస్తే చాలా నిశ్శబ్దంగా, రిజర్వ్‌డ్‌గా ఉండే వ్యక్తిగా అనిపించేవారు. కానీ ఆయన్ని నేరుగా కలిసి, సెట్‌లో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

మలయాళ క్రేజీ హీరోయిన్.. మాళవిక మోహనన్, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో తొలిసారిగా నటిస్తున్న చిత్రం “ది రాజా సాబ్”. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హారర్-కామెడీ చిత్రంలో ఆమె ప్రభాస్ ప్రేమికురాలిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాళవిక తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ అనుభవం తనకు ప్రభాస్ గురించి ఉన్న మొదటి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె వెల్లడించింది.

మాళవిక తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది.. “ప్రభాస్ సర్‌ని కలవడానికి ముందు, ఆయన ఇంటర్వ్యూలు చూస్తే చాలా నిశ్శబ్దంగా, రిజర్వ్‌డ్‌గా ఉండే వ్యక్తిగా అనిపించేవారు. కానీ ఆయన్ని నేరుగా కలిసి, సెట్‌లో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆయన నిజంగా అద్భుతమైన మాటకారి. సూపర్ ఫన్నీ, చాలా కూల్‌గా ఉండే వ్యక్తి. ఆయనతో ఉన్నప్పుడు ఏ క్షణం కూడా డల్‌గా అనిపించదు. ఆయన సరదా స్వభావం, హాస్యం, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే తీరు నిజంగా సెట్‌లో అందరినీ ఆకర్షిస్తాయి..’ అని మాళవిక చెప్పింది.

“ది రాజా సాబ్” చిత్రం గత మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉంది. ఈ చిత్రం ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది, ఎందుకంటే ఇది ఆయన తొలిసారిగా హారర్-కామెడీ జానర్‌లో నటిస్తున్న సినిమా. ఇటీవల నిర్మాతలు ఈ చిత్ర టీజర్‌ని రాబోయే రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు, దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ టీజర్ ద్వారా సినిమా కథాంశం, పాత్రల గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story