‘రాజా సాబ్’ పైనే ఆశలన్నీ పెట్టుకుంది

‘రాజా సాబ్’ పైనే ఆశలన్నీ పెట్టుకుంది
X
సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. సహజంగానే, ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో “ది రాజా సాబ్” చిత్రంపై మాళవికా ఎనలేని ఆశలు పెట్టుకుంది.

మలయాళం బ్యూటీ మాళవికా మోహనన్.. ప్రభాస్ సరసన టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ.. రాబోయే చిత్రం “ది రాజా సాబ్”లో ప్రధాన నాయికల్లో ఒకరిగా నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా నటిస్తున్నప్పటికీ.. మాళవికా తెలుగు సినిమాకు ఇది తొలి అడుగు కావడంతో ఆమె ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది.

తమిళం ఇతర భాషల సినిమాల్లో తన నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన మాళవికా, తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. సహజంగానే, ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో “ది రాజా సాబ్” చిత్రంపై మాళవికా ఎనలేని ఆశలు పెట్టుకుంది.

ఈ రోజు ఆమె 32వ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఆమె కోసం ఒక ప్రత్యేక బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో తెల్లని చీరలో గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తున్న మాళవికా, అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ పాత్రలో కనిపించనుందని సమాచారం.

Tags

Next Story