వైరల్ అవుతున్న మహేశ్ బాబు న్యూ హెయిర్ స్టైల్

సూపర్‌స్టార్ మహేష్ బాబు సాధారణంగా.. స్టైలిష్, సిల్కీ స్ట్రెయిట్ హెయిర్ లోనే కనిపిస్తుంటాడు. అతని లుక్‌లో కర్లీ హెయిర్ ఎప్పుడూ కనిపించలేదు. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా యాక్షన్ చిత్రం కోసం మహేష్ బాబు తన జుట్టును పొడవుగా, దట్టంగా కర్లీగా పెంచాడు. ఈ సినిమా కోసం అతను పూర్తిగా కొత్త రూపంలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా.. ఈ చిత్రం సెట్‌లో అతని భార్య నమ్రత, మరో నటుడితో కలిసి ఉన్న కొన్ని సాధారణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫోటోల్లో మహేష్ బాబు కర్లీ జుట్టు, బలిష్టమైన శరీరాకృతితో కనిపించాడు. అభిమానులు అతని ఈ కొత్త లుక్‌ను చూసి తెగ సంబర పడుతున్నారు. అతని బల్క్-అప్ లుక్ ఒక పెద్ద ఆశ్చర్యం అయితే, కర్లీ జుట్టు మరో ఆకర్షణీయమైన ఐటెమ్ గా నిలిచింది. ఈ చిత్రం ఒక గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి సమీపంలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లో ఆమె కూడా పాల్గొంటున్నారని, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి ఒక గ్రాండ్ పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం.
ఈ వైరల్ ఫోటోలు సెట్‌లోని వాతావరణాన్ని, మహేష్ బాబు కొత్త అవతారాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సినిమా రాజమౌళి గత చిత్రాల్లాగే భారీ స్థాయిలో నిర్మితమవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఈ పాత్ర కోసం చేసిన శారీరక మార్పులు, కొత్త హెయిర్‌స్టైల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu