నైరోబీ నుంచి ఇండియాకి తిరిగొచ్చాడు !

నైరోబీ నుంచి ఇండియాకి తిరిగొచ్చాడు !
X
కెన్యాలో ఒక చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఆగస్టు 27న నైరోబీకి వెళ్లిన ఆయన.. పది రోజుల షూటింగ్‌ను ముగించి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న గ్లోబ్‌ట్రాటర్ (వర్కింగ్ టైటిల్ SSMB29) సినిమా కోసం కెన్యాలో ఒక చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఆగస్టు 27న నైరోబీకి వెళ్లిన ఆయన.. పది రోజుల షూటింగ్‌ను ముగించి తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు.

రాబోయే నెలల్లో కెన్యా షెడ్యూల్ కొనసాగనుంది. మహేష్ హైదరాబాద్, నైరోబీ మధ్య ప్రయాణం చేయనున్నాడు. కెన్యాలోని జాతీయ పార్కులతో పాటు మౌంట్ కిలిమంజారో వద్ద కూడా విస్తృతమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమాలో ప్రధాన నటిగా నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.

భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న గ్లోబ్‌ట్రాటర్.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న చిత్రంగా రూపొందుతోంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టే అంబిషియస్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ చిత్ర బృందం నవంబర్ 2025లో ఒక వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయడంతో పాటు అధికారిక రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనుంది.

Tags

Next Story