ఒకరోజు ముందుగానే రానున్న ‘మ్యాడ్ స్క్వేర్‘

మార్చి నెల చివరిలో వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది ‘మ్యాడ్ స్క్వేర్‘. సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా కళ్యాణ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
అసలు మార్చి 29న రావాల్సిన ‘మ్యాడ్ స్క్వేర్‘ ఒక రోజు ముందుగానే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు.
‘మార్చి 29న అమావాస్య కావడంతో మా డిస్ట్రిబ్యూటర్లు విడుదలను ముందుకు తీసుకురావడం మంచిదని భావించారు. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నాము. అయితే, చివరి క్షణంలో షెడ్యూల్ మార్పు చేయాలనే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాము. మార్చి 28 తెలుగు సినిమాకు ప్రత్యేక రోజుగా నిలవాలని మనసారా కోరుకుంటున్నాము.‘ అంటూ అదే రోజున రాబోతున్న ‘రాబిన్ హుడ్‘కి తన బెస్ట్ విషెస్ తెలిపారు నాగవంశీ.
-
Home
-
Menu