‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ అదిరిపోయిందిగా!

చిన్న సినిమాల సీక్వెల్స్ తో సూపర్ హిట్స్ అందుకుంటుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఇప్పటికే 'డీజే టిల్లు' సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 'మ్యాడ్' సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్'ని తీసుకొస్తుంది. ఈరోజు ‘మ్యాడ్ స్క్వేర్‘ టీజర్ రిలీజ్ అయ్యింది. ‘మ్యాడ్‘ మూవీని ఆద్యంతం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.. ఇప్పుడు సీక్వెల్ ని మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ తో తీర్చిదిద్దాడు.
ఫస్ట్ పార్ట్ లో నటించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సీక్వెల్ లోనూ సందడి చేస్తున్నారు. మొత్తంగా టీజర్ అయితే ఆద్యంతం నవ్వులు పంచుతుంది. మరోవైపు ఇప్పటికే భీమ్స్ సంగీతంలో ఈ సినిమా నుంచి రిలీజైన ‘లడ్డూగాని పెళ్లి, స్వాతిరెడ్డి‘ పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక డబుల్ డోస్ ఎంటర్ టైన్ మెంట్ తో ఫన్ ఫటాకా అందించడానికి మార్చి 29న థియేటర్లలోకి వచ్చేస్తోంది ‘మ్యాడ్ స్క్వేర్‘.
-
Home
-
Menu