రెట్టింపు వినోదంతో ‘మ్యాడ్ స్క్వేర్’ రెడీ!

రెట్టింపు వినోదంతో ‘మ్యాడ్ స్క్వేర్’ రెడీ!
X

‘మ్యాడ్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

మార్చి 29న 'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించడంతో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నార్నే నితిన్ మాట్లాడుతూ, 'మ్యాడ్-1 ఎంత వినోదం అందించిందో అందరికీ తెలుసు. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ దానికి పది రెట్లు ఎక్కువ కామెడీని అందిస్తుంది. థియేటర్లలో ఎవరూ నిశ్శబ్దంగా కూర్చోలేరు' అని తెలిపారు.

సంగీత్ శోభన్ తనదైన స్టైల్లో, 'టీజర్ చూసి ఎంజాయ్ చేశారుగా? కానీ అది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు ఫన్ సినిమా చూస్తే తెలుస్తుంది. మా నిర్మాత వంశీ గారు ఒకటే చెప్పారు… సినిమా నచ్చకపోతే డబుల్ రీఫండ్ (నవ్వుతూ)' అని అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, 'మ్యాడ్ స్క్వేర్' మొదటి భాగాన్ని మించిన వినోదంతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించబోతుందని ధీమాగా తెలిపారు. 'ప్రతి సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఖచ్చితంగా ఇది బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, 'మంచి సినిమా తీశాం. నవ్వాలంటే థియేటర్లకు రండి. స్నేహితులతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి' అని ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించారు

Tags

Next Story