‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ఎప్పటి నుంచి?

‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ఎప్పటి నుంచి?
X
అంతా అనుకున్నట్లు జరిగితే, 2025 చివర్లో “మా ఇంటి బంగారం” షూటింగ్ మొదలవ్వచ్చు.

టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంతా రుత్ ప్రభుకు దర్శకురాలు నందిని రెడ్డితో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ గతంలో ‘జబర్దస్త్, ఓ బేబీ’ సినిమాలతో ఆడియన్స్ ను అలరించారు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వారి తదుపరి ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

తాజా సమాచారం ప్రకారం, సమంతా తన “మా ఇంటి బంగారం” సినిమాను నందిని రెడ్డికి అప్పగించింది. ఈ సినిమా చాలా కాలం క్రితం అనౌన్స్ అయింది. మొదట్లో ఓ కొత్త దర్శకుడితో ప్లాన్ చేశారు. 1980ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను నందిని తనదైన శైలిలో రీరైట్ చేస్తోంది. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సమంతా తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనుంది.

తాజా ఇంటర్వ్యూలో సమంతా.. ప్రభావవంతమైన ప్రాజెక్ట్‌లపై దృష్టి పెడతానని చెప్పింది. ఆరోగ్యం, సరైన విశ్రాంతి ఇప్పుడు తన ప్రాధాన్యతలని పేర్కొంది. అంతా అనుకున్నట్లు జరిగితే, 2025 చివర్లో “మా ఇంటి బంగారం” షూటింగ్ మొదలవ్వచ్చు.

Tags

Next Story