ప్రేమ, మోసం, విషాదాంతం – కావ్య కళ్యాణి ఆత్మహత్య వెనుక కథ!

టీవీ డ్యాన్స్ షోల ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యువ నర్తకి కావ్య కళ్యాణి (24) తన జీవితాన్ని విషాదాంతంగా ముగించుకుంది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
కావ్య కళ్యాణి మరణానికి ప్రేమ వైఫల్యమే కారణమని ఆమె చివరిగా తీసుకున్న సెల్ఫీ వీడియో ద్వారా తెలుస్తోంది. వీడియోలో ఆమె తన ప్రియుడు అభి మోసం చేశాడని ఆరోపించింది. అయిదేళ్లుగా ప్రేమిస్తున్నానని నమ్మించి, తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని చెప్పిన ఆమె, చివరికి అతను మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని వాపోయింది. "నన్ను ప్రేమించానని చెప్పి, ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నన్ను వెళ్లిపొమ్మన్నాడు. ఇక నా జీవితానికి అర్ధమే లేదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషాదకర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
-
Home
-
Menu