#SSMB29 నుంచి లీకైన వీడియో!

#SSMB29 నుంచి లీకైన వీడియో!సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న #SSMB29 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ ప్రాంతంలో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నారు.
అవుట్‌డోర్ లో షూటింగ్ జరుగుతుండడంతో లీక్‌ల సమస్య పెరిగింది. చిత్రబృందం భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని వీడియోలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి లీకైన 30 సెకండ్ల వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లీకులు సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. అయితే అదే సమయంలో చిత్రబృందానికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. మూవీ టీమ్ తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోకపోతే, మరిన్ని లీక్‌లు జరగే అవకాశముంది.
పాన్ వరల్డ్ రేంజులో తెరకెక్కుతోన్న యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 ప్రథమార్థంలో విడుదల చేయనున్నారనే ప్రచారం ఉంది.
-
Home
-
Menu