‘లీడర్ 2’ పై మళ్లీ చర్చలు.. శేఖర్ కమ్ముల హింట్

‘లీడర్ 2’ పై మళ్లీ చర్చలు.. శేఖర్ కమ్ముల హింట్
X
‘లీడర్’ సినిమాను ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో రీమేక్ చేస్తే... అది భారతీయ సినిమాను మార్చివేయగలదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

టాలీవుడ్‌లో రానా దగ్గుబాటి హీరోగా పరిచయమైన చిత్రం ‘లీడర్’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా కమర్షియల్ గా అంతగా విజయాన్ని సాధించకపోయినా.. కాలంతో పాటు క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. అప్పటి నుంచీ ప్రేక్షకుల నుంచి ‘లీడర్ 2’ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రానా కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో ధృవీకరించారు. ఇప్పుడు మళ్లీ ‘లీడర్ 2’ చర్చల్లోకి వచ్చింది.

‘లీడర్’ సినిమాను ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో రీమేక్ చేస్తే... అది భారతీయ సినిమాను మార్చివేయగలదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల ‘లీడర్ 2’ సాధ్యాసాధ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘లీడర్ రచన సమయంలో లక్షల కోట్లు అనే నెంబర్లు రాజకీయాల్లో ఆశ్చర్యకరంగా అనిపించేవి. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య చాలా చిన్నదిగా అనిపిస్తోంది. రాజకీయ వ్యూహాలు, అవినీతికి సంబంధించిన గణాంకాలు విపరీతంగా మారిపోయాయి. నేటి రాజకీయ పరిస్థితుల్ని, సమాజంపై వాటి ప్రభావాన్ని కొత్తగా అర్థం చేసుకునేలా సినిమాను రూపొందించాలనే ఆసక్తి ఉంది,’’ అని కమ్ముల వెల్లడించారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ధనుష్, నాగార్జున, రష్మికల ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తైన తర్వాత ‘లీడర్ 2’ పై కమ్ముల పూర్తి దృష్టిపెట్టే అవకాశముంది. ఇప్పుడు ‘లీడర్ 2’ నిజంగా కార్యరూపం దాల్చుతుందా? ఏ విభాగాల్లో కొత్తదనం తీసుకురాబోతున్నారా? అనే అంశాలు సినీప్రేమికుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

Tags

Next Story