సరికొత్తగా ‘రాబిన్ హుడ్‘ ప్రచారం

Latest 'Robin Hood' promotionఒక సినిమా తీయడం ఒకెత్తు అయితే.. ఆ చిత్రాన్ని జనంలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే.. మన మేకర్స్ తమ చిత్రాల కోసం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం‘ కోసం హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ప్రచార సందడిని చూశాము.
ఇప్పుడు అదే దారిలో ‘రాబిన్ హుడ్‘ కోసం హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుమల ప్రచారంలో చెలరేగిపోతున్నారు. తమ సినిమాని జనంలోకి తీసుకెళ్లడం కోసం పబ్లిసిటీలో సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి చేసిన ఓ సరదా పాడ్ కాస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
‘ది హానెస్ట్ పాడ్ కాస్ట్ ఎపిసోడ్ 1‘ పేరుతో విడుదలైన ఈ పాడ్ కాస్ట్ లో నితిన్ ‘సినిమాలో హీరోయిన్ అంటే ఉత్తరాదివారే కావాలా?‘, సినిమాల్లో ‘శుభం‘ కార్డు మాయమైంది ఎందుకు?‘ అంటూ నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకీ కుడుమల హానెస్ట్ గా సమాధానాలు చెప్పడం ఆకట్టుకుంటుంది. మార్చి 28న ‘రాబిన్ హుడ్‘ విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu