అంచనాలు పెంచేసిన ‘ఎంపురాన్’ ట్రైలర్

అంచనాలు పెంచేసిన ‘ఎంపురాన్’ ట్రైలర్
X
మోహన్‌లాల్ పవర్‌ఫుల్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, భీకరమైన బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ సినిమా అంచనాలను పెంచాయి.

మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, 2019 లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ ‌కు సీక్వెల్‌గా రాబోతోంది. తాజాగా చిత్రబృందం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. "మనిషి ప్రాణం కంటే ఏది విలువైంది కాదు.." అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్, ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది.

ఇందులో మోహన్‌లాల్ పవర్‌ఫుల్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, భీకరమైన బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ సినిమా అంచనాలను పెంచాయి. రాజకీయ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం, భారీ నిర్మాణ విలువలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. మొదటి భాగమైన ‘లూసిఫర్’ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో, దాని సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ సినిమాలో మోహన్‌లాల్ మరోసారి అద్భుతమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే, పృథ్వీరాజ్‌ సుకుమారన్ ఇందులో కీలక పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అద్భుతమైన కథ, అత్యున్నతమైన టెక్నికల్ స్టాండర్డ్స్‌ కలిగిన ‘లూసిఫర్ 2: ఎంపురాన్’, ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేయడానికి సిద్ధమవుతోంది. ఈ భారీ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags

Next Story