దర్శకుడిగా క్రాంతిమాధవ్ ‘రీఎంట్రీ’

"ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" లాంటి మంచి సినిమాలతో పాపులర్ అయిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. ఈసారి చైతన్య రావు మద్దూరి మెయిన్ లీడ్‌గా ఓ కొత్త రొమాంటిక్ డ్రామా ను తెరకెక్కిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను పూజ కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేశారు. దేవ కట్టా క్లాప్ కొట్టగా, కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా ఆన్ చేశారు.
“ఇది నాకు ఐదో సినిమా. చైతన్యతో పనిచేయడం ఇది రెండోసారి,” అని క్రాంతి మాధవ్ చెప్పారు. “ఐరా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే బెంగాలీ టీవీ నుంచి సాఖీ కూడా మా టీమ్‌లో జాయిన్ అయింది.” డైరెక్టర్‌తో మళ్లీ పనిచేయడం, శ్రీయస్ చిత్ర, పూర్ణ నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్లలో సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చైతన్య రావు అన్నారు.
ప్రొడ్యూసర్ పూర్ణ నాయుడు, క్రాంతి మాధవ్‌తో అసోసియేట్ అవ్వడం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని చెప్పారు. ఇక ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలోకి వస్తున్న ఐరా... తను చాలా ఇష్టపడే డైరెక్టర్‌తో ఈ జర్నీ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది.
-
Home
-
Menu