కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కన్నుమూత

కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కన్నుమూత
X
ప్రముఖ దివంగత తెలుగు నటుడు కోట శ్రీనివాస రావు సతీమణి రుక్మిణి కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దివంగత తెలుగు నటుడు కోట శ్రీనివాస రావు సతీమణి రుక్మిణి కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే.. జులై 13 న కోట శ్రీనివాస రావు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదకర సంఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు అలుముకుంది.

కోట శ్రీనివాస రావు తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణం తర్వాత రుక్మిణి గారి మరణం ఆయన కుటుంబానికి, సినీ ప్రముఖులకు, అభిమానులకు తీరని లోటును మిగిల్చింది.

రుక్మిణి గారు 1968లో కోట శ్రీనివాస రావును వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు కుమార్తెలు పావని, పల్లవి. ఒక కుమారుడు ప్రసాదరావు. అయితే ప్రసాదరావు 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కోట దంపతుల మరణంతో సినీ రంగంలో విషాదం నెలకొంది.

Tags

Next Story