సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం?

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ స్థాపించిన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌పై పలు చిత్రాలు తెరకెక్కనున్నాయి. ఈ నిర్మాణ సంస్థ నుండి రాబోయే తదుపరి చిత్రంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ సినిమా ఒక వినోదాత్మక చిత్రంగా ఉంటుందని సమాచారం.
సుకుమార్ శిష్యుడు వీర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కాబోతోంది. సుకుమార్ రైటింగ్స్ త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయనుంది. వీర చెప్పిన స్టోరీ సుకుమార్‌కి బాగా నచ్చడంతో ఆయన ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కి ఆమోదం తెలిపారని టాక్. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం ఇటీవల ‘కే ర్యాంప్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. సుకుమార్ రైటింగ్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి ముందు, ఈ ఏడాదిలోనే కిరణ్ ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడు. మరోవైపు సుకుమార్.. రామ్ చరణ్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది మొదలవుతుంది.
-
Home
-
Menu