‘కింగ్ డమ్’ విడుదల ఎప్పుడో?

‘కింగ్ డమ్’  విడుదల ఎప్పుడో?
X
ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం, “కింగ్‌డమ్” మేకర్స్ వచ్చే వారంలో సినిమా రిలీజ్ డేట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “కింగ్‌డమ్” సినిమా.. తొలి సాంగ్ రిలీజ్‌తో ఒకప్పుడు సృష్టించిన భారీ హైప్‌ను ఇప్పుడు పూర్తిగా కోల్పోయినట్లే కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్, రిలీజ్ ప్లాన్స్‌లో పదేపదే జరిగిన ఆలస్యాలు, వాయిదాలు దీనికి ప్రధాన కారణం. అంతేకాదు, సరైన ప్రమోషనల్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల ఈ సినిమా చుట్టూ ఉన్న బజ్ రోజురోజుకూ తగ్గిపోతోంది. కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన ఒక సాంగ్, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌తో అదిరిపోయినా, ఆ తర్వాత సరైన ఫాలో అప్ కంటెంట్ లేకపోవడంతో అది ప్రేక్షకుల మైండ్‌లో నుంచి ఒక్కసారిగా ఆవిరైపోయింది.

విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న కామెంట్స్‌లో విజయ్ తన సినిమాల కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో కూడా ఫోకస్ చేయాలని సూచనలు వస్తున్నాయి. ఈ విమర్శల మధ్య, “కింగ్‌డమ్” టీమ్ ఎట్టకేలకు సీరియస్ అయినట్లు కనిపిస్తోంది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం, “కింగ్‌డమ్” మేకర్స్ వచ్చే వారంలో సినిమా రిలీజ్ డేట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరి హర వీర మల్లు” టీమ్ తాజాగా తమ సినిమా జూలై 24న రాబోతున్నట్టు ప్రకటించారు. “కింగ్‌డమ్” టీమ్ త్వరలోనే తమ అనౌన్స్‌మెంట్‌తో రాబోతున్నట్లు బజ్. ఈ స్ట్రాటజీతో వారు మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు.

ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ఒక పీరియడ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌కు బిగ్గెస్ట్ అసెట్‌గా నిలుస్తున్నారు. “కింగ్‌డమ్” ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ.. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, టీమ్ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేస్తుందనే దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.

Tags

Next Story