ఓటీటీలోకి కిచ్చా సుదీప్ "మ్యాక్స్"

ఓటీటీలోకి కిచ్చా సుదీప్ మ్యాక్స్
X

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం "మ్యాక్స్" బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. యాక్షన్ డ్రమాగా రూపొందిన ఈ చిత్రం విజయ్ కార్తికేయన్ దర్శకత్వంలో రూపొందింది. 2024 డిసెంబర్ 25న కన్నడలో విడుదలైన ఈ సినిమా, రెండు రోజులకు అంటే డిసెంబర్ 27న తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి మంచి వార్త! అందుతున్న సమాచారం ప్రకారం, అన్ని అనుకున్నట్లు జరిగితే "మ్యాక్స్" ఫిబ్రవరి 22, 2025న జీ 5 ఓటీటీలో గ్రాండ్ ప్రీమియర్ కానుంది. తెలుగు సహా అనేక భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది, కాబట్టి కొంత సమయం వెయిట్ చెయ్యాలి.

ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సునిల్, సమ్యూక్త హోర్నాడ్, సుకృత వాగ్లే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రఖ్యాత నిర్మాత కలైప్పులి ఎస్. ధాను నిర్మించిన ఈ చిత్రానికి, ప్రతిభావంతుడైన అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.ఓటీటీలోకి కిచ్చా సుదీప్ "మ్యాక్స్"

Tags

Next Story