విజయ్ దేవరకొండకు జోడీగా మహానటి?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్’ . మే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రెండు ప్రాజెక్టులలో నటించ బోతున్నాడు. ‘రాజా వారూ రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ముందుగా చిత్రయూనిట్ రుక్మిణి వసంత్ ను కథానాయికగా అనుకుంటే, కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్క్ అవుట్ కాలేదని తెలుస్తోంది. అయితే, కీర్తి సురేష్ కథ వినగానే వెంటనే అంగీకరించిందట. కీర్తి సురేశ్ ‘మహానటి’ చిత్రంలో విజయ్ దేవరకొండ నటించినప్పటికీ.. స్ర్కీన్ షేర్ చేసుకోలేదు.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ గోదావరి యాసలో మాట్లాడబోతుందట. స్థానిక రాజకీయాల నేపథ్యంలో సాగే కథ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కథలో పుష్కలమైన మాస్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ వేసవిలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. టాలీవుడ్ ప్రియులకు మరో మాస్ ఎంటర్‌టైనర్ సిద్ధం.
-
Home
-
Menu