పెళ్ళి తర్వాత ఏకంగా 4 ప్రాజెక్ట్స్ తో బిజీ !

పెళ్ళి తర్వాత ఏకంగా 4 ప్రాజెక్ట్స్ తో బిజీ !
X
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మల్టిపుల్ ఇండస్ట్రీస్ లో , మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ లైనప్ చూస్తే.. ఆమె టైమ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ అని ఫిక్స్ అవుతారు.

మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కాస్త స్లో డౌన్ అవుతుందని ఎవరైనా అనుకుంటే.. వాళ్లు పొరపాటు పడినట్టే. ఈ హీరోయిన్ తన వెర్సటైల్ యాక్టింగ్‌తో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉంటుంది. ఇప్పుడు ఫుల్ జోష్‌లో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మల్టిపుల్ ఇండస్ట్రీస్ లో , మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ లైనప్ చూస్తే.. ఆమె టైమ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ అని ఫిక్స్ అవుతారు.

ముందుగా.. రివాల్వర్ రీటా గురించి చెప్పుకోవాలి. ఈ ఫీమేల్ లీడ్ కామెడీ మూవీ, కీర్తి ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌లా రానుంది. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్ డేట్ లాక్ అయింది. కీర్తి కామెడీ టైమింగ్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్.. ఈ సినిమాలో ఎలా బ్లాస్ట్ అవుతాయో ఊహించుకోవడమే థ్రిల్లింగ్‌గా ఉంది. ఇక అంతకు ముందే.. ఓటీటీ ఫ్యాన్స్‌కి కీర్తి నుంచి సర్‌ప్రైజ్ రెడీ. సుహాస్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఉప్పుకప్పురంబు’ జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ స్టార్ట్ కానుంది. ఈ మూవీలో కీర్తి రోల్ ఏంటన్నది ఇంకా సస్పెన్స్‌లో ఉన్నా, ఆమె టచ్ ఉంటే సినిమాకి ఎక్స్‌ట్రా కిక్ గ్యారెంటీ.

అదే టైమ్‌లో.. మరో ప్రాజెక్ట్ ‘అక్క’ కూడా ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో డ్రాప్ చేయాలని ఆమె టీమ్ ఫుల్ ప్లాన్‌లో ఉందట. రిలీజ్ డేట్ కోసం చర్చలు జోరుగా సాగుతున్నాయి. కీర్తి షెడ్యూల్‌ని చూస్తే, ఆమె ఎనర్జీ లెవెల్స్‌కి ఫిదా అవ్వాల్సిందే. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఆమె మళ్లీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తోంది. వారం వారీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్స్, షూటింగ్ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి.

‘బలగం’ ఫేమ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ‘ఎల్లమ్మ’ అనే విలేజ్ ఎమోషనల్ డ్రామాలో కీర్తి సైన్ చేసినట్లు బజ్. ఈ మూవీలో ఆమె ఎమోషనల్ డెప్త్‌ని మళ్లీ ప్రూవ్ చేయబోతోందని అంటున్నారు. అలాగే, విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్థన్’ లోనూ ఆమె భాగమైందని హాట్ టాపిక్. ఇవి కాకుండా, బాలీవుడ్‌లో కూడా ఓ ప్రాజెక్ట్ కోసం టాక్స్ జరుగుతున్నాయట. ఇది కన్ఫర్మ్ అయితే, కీర్తి బాలీవుడ్ ఎంట్రీ మరో లెవెల్ బ్లాక్‌బస్టర్ కావడం పక్కా. మొత్తానికి థియేటర్స్‌ రిలీజ్‌ల నుంచి ఓటీటీ డ్రాప్స్ వరకు.. రీజనల్ సినిమాల నుంచి పొటెన్షియల్ బాలీవుడ్ వెంచర్స్ వరకు కీర్తి కమ్ బ్యాక్ ఎప్పటికీ ఆగని జర్నీలా కనిపిస్తోంది.

Tags

Next Story