చిరంజీవి నెక్స్ట్ మూవీ కోసం ‘మిరాయ్’ డైరెక్టర్

చిరంజీవి నెక్స్ట్ మూవీ  కోసం ‘మిరాయ్’ డైరెక్టర్
X
“మిరాయ్” అతని మూడో డైరెక్టోరియల్ వెంచర్. ఫిల్మ్‌మేకర్‌గా తొలి బిగ్ హిట్. డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేయనున్నట్లు ధృవీకరించారు.

కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్‌గా గుర్తింపు పొందకముందు, అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. డైరెక్టర్‌గా తొలి చిత్రం సూర్య వెర్సస్ సూర్య తర్వాత కూడా, “కార్తీకేయ 2” వంటి బ్లాక్‌బస్టర్‌లకు సినిమాటోగ్రఫీ చేశాడు. ఇప్పుడు “మిరాయ్” సూపర్ హిట్ తర్వాత.. కార్తీక్ మళ్లీ కెమెరా వెనక్కి వెళ్తున్నట్టు సమాచారం.

“మిరాయ్” అతని మూడో డైరెక్టోరియల్ వెంచర్. ఫిల్మ్‌మేకర్‌గా తొలి బిగ్ హిట్. డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేయనున్నట్లు ధృవీకరించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్నాడు.

చిరంజీవి ప్రాజెక్ట్ అని తెలియగానే వెంటనే ఒప్పుకున్నట్లు కార్తీక్ తెలిపాడు. “మెగాస్టార్‌ని నా కెమెరాతో బంధించే అవకాశాన్ని వదులుకోలేను,” అని అతడు అన్నాడు. చిరంజీవి చిత్రం పూర్తయిన తర్వాత.. తిరిగి డైరెక్షన్‌పై దృష్టి పెడతానని కార్తీక్ స్పష్టం చేశాడు. వచ్చే నెల్లో దసరా కానుకగా చిరు- బాబీ మూవీ లాంచ్ కానున్నట్టు వార్తలొస్తున్నాయి.

Tags

Next Story