ఆకట్టుకుంటున్న ‘హిట్ 4’ కార్తి లుక్

నేచురల్ స్టార్ నానీ నటించిన ‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మే 29, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ రావడంతో థియేటర్లలో చూడలేని చాలా మంది ప్రేక్షకులు దీని ఓటీటీ రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హిట్ ఫ్రాంచైజ్‌లోని ఈ మూడవ భాగం థ్రిల్లింగ్ కథాంశం, ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ ఓటీటీ రిలీజ్ హైప్ మధ్య.. హిట్ ఫ్రాంచైజ్‌లోని నాల్గవ భాగం, ‘హిట్ 4’ కూడా ఇప్పటికే హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ సినిమా నుంచి హీరో కార్తి ఫస్ట్ లుక్‌ని మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఇది అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘హిట్ 4’ లో కార్తి ఏసీపీ వీరప్పన్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమా బర్త్‌డే పోస్టర్‌లో కార్తీ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకర్షించింది. అతని డ్యాషింగ్ లుక్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ పాత్ర ఫ్రాంచైజ్‌కి కొత్త డైమెన్షన్‌ని తీసుకొస్తుందని స్పష్టమవుతోంది.
ఈ చిత్రాన్ని శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు, ఇతను హిట్ ఫ్రాంచైజ్‌ని ఇప్పటివరకు విజయవంతంగా నడిపించిన దర్శకుడు. ఈ సినిమాని నాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు, ఇది హిట్ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యంత గ్రాండియర్ ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ మరింత శక్తివంతంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
Its Official : #Karthi's Next #HIT4 🔥
— Prakash Mahadevan (@PrakashMahadev) May 25, 2025
Telugu - Tamil Bilingual 🙌 pic.twitter.com/vmCfKtbtSf
-
Home
-
Menu