‘ది రాజాసాబ్’ కోసం కరీనా కపూర్ ?

‘ది రాజాసాబ్’  కోసం కరీనా కపూర్ ?
X
మొదట ఈ సాంగ్ కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతారాను అనుకున్నారు, కానీ ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో కరీనా కపూర్ పేరు తెరపైకి వచ్చింది.

‘ది రాజాసాబ్’ సినిమాకి ఇప్పటికే ఓ రేంజ్‌లో హైపు క్రియేట్ అయింది. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌తో ఈ మూవీ వార్తల్లో నిలుస్తోంది. మారుతి డైరెక్షన్‌లో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ హారర్ కామెడీ సినిమా, దాని పోస్టర్లు, స్నీక్ పీక్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసింది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతున్న తరుణంలో.. ఓ స్పెషల్ సాంగ్ గురించి టాక్ హాట్ టాపిక్‌గా మారింది. అసలు మేటర్ కొస్తే బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ప్రభాస్‌తో కలిసి ఈ సాంగ్‌లో చిందులేయబోతోందట.

మొదట.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఐటెమ్ సాంగ్ కోసం ఓ క్లాసిక్ బాలీవుడ్ ట్రాక్‌ను రీమిక్స్ చేయాలని ప్లాన్ చేశారు. అది కూడా ప్రభాస్ లార్జర్-దాన్-లైఫ్ ఇమేజ్‌కు సరిపోయేలా. కానీ, ఆ ఐడియాను పక్కనపెట్టి.. కొత్తగా ఓ ఒరిజినల్ బీట్ క్రియేట్ చేశారు. ఈ సాంగ్ మాస్ అప్పీల్‌తో, హై-ఎనర్జీతో, బోల్డ్ విజువల్స్‌తో, స్క్రీన్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేశారట. మొదట ఈ సాంగ్ కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతారాను అనుకున్నారు, కానీ ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో కరీనా కపూర్ పేరు తెరపైకి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ కరీనా కపూర్ తో చర్చలు జరుపుతున్నారు, అందుకోసం భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేస్తున్నారట. ఆమె పేరు వినగానే ఫ్యాన్స్ ఉత్సాహం పీక్స్‌కు చేరింది. ప్రభాస్‌తో కరీనాను ఈ జోనర్‌లో చూస్తామని ఎవరూ ఊహించలేదు. ఆమె ఒప్పుకుంటుందా లేక తిరస్కరిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అలాంటిది కరీనా లాంటి స్టార్ రాజా సాబ్ సాంగ్‌లో నటిస్తే, ఆ హైప్ సినిమాను మించిపోతుంది. ఆమె సైన్ చేసినా, చేయకపోయినా, ఈ హైప్ మాత్రం ఇప్పటికే ఊపందుకుంది.

Tags

Next Story