అనుకున్న డేట్ లోనే ‘కాంతారా చాప్టర్ 1’ !

అనుకున్న డేట్ లోనే  ‘కాంతారా చాప్టర్ 1’ !
X
ఈ వార్తలపై నిర్మాతలు అయిన హోంబలే ఫిల్మ్స్ స్పందించారు. ఈ వార్తలు నిరాధారమని స్పష్టం చేస్తూ, సినిమాను ముందుగా ప్రకటించినట్టు 2025 అక్టోబర్ 2 నే విడుదల చేస్తామని తెలిపారు.

జాతీయ అవార్డు విజేతగా ఎదిగిన నటుడు, రచయిత, దర్శకుడు రిషబ్ శెట్టి తన అద్భుతమైన నటనతో 'కాంతారా' చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ చిత్రం ఆయన అద్భుత స‌ృష్టి, అజనీష్ లోకనాథ్ సంగీతం, శక్తివంతమైన నేపథ్య సంగీతంతో దేశవ్యాప్తంగా పెద్ద విజయాన్ని సాధించింది. పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమాకు భారీ స్పందన లభించింది.

ఈ సినిమాకు అభిమానం రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో, 'కాంతారా చాప్టర్ 1' అనే పేరుతో రూపొందుతున్న ప్రీక్వెల్‌పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల కొన్ని మీడియాలో ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ వార్తలపై నిర్మాతలు అయిన హోంబలే ఫిల్మ్స్ స్పందించారు. ఈ వార్తలు నిరాధారమని స్పష్టం చేస్తూ, సినిమాను ముందుగా ప్రకటించినట్టు 2025 అక్టోబర్ 2 నే విడుదల చేస్తామని తెలిపారు. షూటింగ్ ప్రణాళిక ప్రకారమే కొన సాగుతుందని వారు తెలిపారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కూడా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. రిషబ్ శెట్టి నుంచి మరో వైవిధ్యమైన కథను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags

Next Story