ఆ విషయంలో ‘కన్నప్ప’ దీ అదే ట్రెండ్ !

ఆ విషయంలో ‘కన్నప్ప’ దీ అదే ట్రెండ్ !
X
ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో లాక్ అయింది. ఇది చాలా గ్రాండ్ స్కేల్ లో అదిరిపోయే కథాకథనాలతో తెర కెక్కిందని సమాచారం.

విష్ణు మంచు భారీ మైథలాజికల్ డ్రామా ‘కన్నప్ప’. ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రాల్లో ఇది కూడా ఒకటి. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో లాక్ అయింది. ఇది చాలా గ్రాండ్ స్కేల్ లో అదిరిపోయే కథాకథనాలతో తెర కెక్కిందని సమాచారం.

3 గంటలకు పైగా ఉన్న ఈ రన్‌టైమ్.. ఇటీవలి ట్రెండ్ అయిన ఎపిక్-లెంగ్త్ పాన్-ఇండియా చిత్రాలను ఫాలో అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ (3 గం 2 ని), ‘యానిమల్’ (3 గం 21 ని), ‘పుష్ప’ (3 గం), లియో, దేవర, సలార్ వంటి బిగ్గీలు కూడా 3 గంటలకు దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువ సమయం నడిచాయి. గ్రిప్పింగ్ కథనం, ఎమోషనల్ డెప్త్ ఉన్న కంటెంట్ ఉంటే ఈ ఫార్మాట్ బాగా వర్కవుట్ అవుతుంది.

మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్, పవర్ ఫుల్ స్టార్ కేస్ట్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ‘కన్నప్ప’ ఒక విజువల్ అండ్ ఎమోషనల్ స్పెక్టాకిల్‌గా ఉండనుంది. ఈ స్టోరీ రన్‌టైమ్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని టీమ్ ధీమాగా ఉంది. సరిగ్గా కుదిరితే, ‘కన్నప్ప’ సినిమా 180 నిమిషాలకు పైగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్ జాబితాలో చేరవచ్చు.

ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ స్టడెడ్ తారాగణం ఉంది. ఇది సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, విష్ణు మంచు లీడ్ రోల్‌తో పాటు స్క్రిప్ట్ కూడా రాశారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చుతున్నాడు.

Tags

Next Story