అవకాశాల వెల్లువలో ‘కన్నప్ప’ హీరోయిన్

మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ సినిమా గత వారం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హడావుడి చేసింది. ఈ సినిమా విష్ణుకి అద్భుతమైన సక్సెస్ ను తెచ్చిపెట్టింది. అదే సమయంలో హీరోయిన్ ప్రీతి ముకుందన్‌కి కూడా టాలీవుడ్‌లో మంచి ప్రారంభం ఇచ్చింది. ఈ మూవీలో నెమలి పాత్రలో ప్రీతి అందమైన లుక్‌తో, గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యంగ్ ఆడియెన్స్‌కి ఆమె స్టైల్ బాగా నచ్చింది.
ఫలితంగా పీరియాడికల్ మూవీస్‌కి మాత్రమే కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కోసం కూడా డైరెక్టర్లు ఆమెను సంప్రదించడానికి ఆసక్తి చూపుతున్నారు. తన మొదటి తెలుగు సినిమాలోనే ప్రీతి కాన్ఫిడెంట్‌గా, స్క్రీన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా విష్ణుపైనే ఫోకస్ అయ్యినా, ఆమె పెర్ఫార్మెన్స్ చూసినవాళ్లను ఆకట్టుకుంది. పెద్దగా మీడియా బజ్ లేకపోయినా, తనదైన ముద్ర వేసింది.
ఇప్పుడు ప్రీతి తన యాక్టింగ్ రేంజ్ చూపించే గ్లామరస్ రోల్స్ చేయాలని ఆశిస్తుంది. మంచి ఆఫర్స్ వస్తే, ‘కన్నప్ప’ ఆమె టాలీవుడ్‌లో పూర్తి స్థాయి కెరీర్ ప్రారంభానికి మైలురాయిగా మారే అవకాశం ఉంది. ఆమెకు మంచి నటనతో పాటు క్వాలిటీ డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇవి టాలీవుడ్‌లో ఆమెకు చాలా ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు. అదే ఆమె కోరుకుంటున్నదీ.
-
Home
-
Menu