
యన్టీఆర్ - నీల్ మూవీలో కన్నడ స్టార్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక హై యాక్టెన్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి తాత్కాలికంగా 'డ్రాగన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కోసం ఇప్పటినుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజా అప్డేట్స్ ప్రకారం.. కన్నడ సూపర్‌స్టార్ రిషభ్ శెట్టి... ఈ సినిమాలో కీలకమైన ఎక్స్‌టెండెడ్ రోల్ ప్లే చేయబోతున్నారని తెలుస్తోంది.
సినిమాలో ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. దాన్ని ప్రశాంత్ నీల్ స్పెషల్‌గా డిజైన్ చేశారని, ఆ రోల్ కోసం రిషభ్ శెట్టిని ఎంచుకున్నారని సమాచారం. ఎన్టీఆర్, రిషభ్ శెట్టి ఇద్దరూ మంచి స్నేహితులు, ఇద్దరికీ కన్నడ రూట్స్ ఉన్నాయి. కాబట్టి, ఈ కాంబినేషన్ వారి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తూ.. సినిమాపై భారీ అంచనాలను పెంచే అవకాశం ఉంది. ఈ తెలుగు-కన్నడ స్టార్స్ క్రాస్‌ఓవర్ కలబోరేషన్ సినిమాకు ఎక్స్‌ట్రా బజ్ తీసుకొస్తుంది.
అంతేకాదు, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళం యాక్టర్ టోవినో థామస్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన రోల్స్‌లో కనిపించబోతున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది సినిమాకు మరింత ఊపు తెచ్చే అంశం. ఈ సినిమా భారీ మాస్ కమర్షియల్ అప్పీల్‌తో రూపొందుతోంది. ఇది ఇటీవలి ఇండియన్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతున్న ఫార్ములా. అందుకే ఈ చిత్రం ఇండియన్ సినిమా స్పేస్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తోంది.
-
Home
-
Menu