కళ్యాణ్ రామ్ మరో సాహసోపేతమైన ప్రయత్నం!

సినిమా పరిశ్రమలో విజయాన్ని నిలబెట్టుకోవాలంటే, సాహసాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. నందమూరి కళ్యాణ్ రామ్ అలాంటి సాహసయోధుల్లో ఒకడు. హీరోలు నిర్మాతలుగా మారడానికి చాలా భయపడుతంటారు. అలాంటిది నిర్మాతగా, హీరోగా ఘన విజయాలు అందుకోవడం ఈతరంలో కళ్యాణ్ రామ్ కే దక్కింది.
‘అతనొక్కడే, పటాస్, బింబిసార‘ వంటి భారీ విజయాల తర్వాత మరోసారి తన సొంత నిర్మాణంలో భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. NKR21 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ తో కలిసి అశోక్ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ.60 కోట్లు అనే ప్రచారం జరుగుతుంది.
గతంలో ‘బింబిసార‘ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందింది. ఆ సమయంలో అంతా అది రిస్కీ ప్రాజెక్ట్ అని కళ్యాణ్ రామ్ ను వారించారు. అయినా ‘బింబిసార‘తో ఘన విజయాన్నందుకుని హీరోగా, నిర్మాతగా తన భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు తన 21వ చిత్రంతోనూ కళ్యాణ్ రామ్ కచ్చితంగా హిట్ కొడతాడనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు నందమూరి అభిమానులు.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపిస్తుండగా.. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. త్వరలోనే కళ్యాణ్ రామ్ 21 టైటిల్ తో పాటు, రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోనుంది.
-
Home
-
Menu