నేను రూమర్స్‌ని అస్సలు పట్టించుకోను : కాజల్ అగర్వాల్

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఒక జ్యువెలరీ స్టోర్ లాంచ్‌లో మెరిసింది. 40 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా స్టన్నింగ్‌గా కనిపించింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు, ఆమె చాలా టాప్ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
ప్రస్తుతం తను మళ్ళీ తమిళం, తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నట్టు కాజల్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తన చుట్టూ జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియా గాసిప్స్‌పై ఆమె స్పందిస్తూ.. "నేను రూమర్స్‌ని అస్సలు పట్టించుకోను" అని కుండబద్దలు కొట్టేసింది.
తన కొడుక్కి ఇప్పుడు రెండేళ్లు కావడంతో.. కాజల్ యాక్టివ్‌గా మరిన్ని సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి ముంబైలో సెటిల్ అయింది. ఈ ఏడాది ఆమె నటించిన "సికందర్, కన్నప్ప" సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో రాబోయే "రామాయణ" సినిమాలో కూడా ఆమె ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.
-
Home
-
Menu