మూడు ఇండస్ట్రీలను ఊపేస్తున్న చందమామ

కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ ఇంకా దూసుకెళ్తూనే ఉంది. పెళ్లి, పిల్లలు.. ఇవేమీ కెరీర్‌కు ఆటంకం కాకపోవడం విశేషం. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కాజల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన హవా కొనసాగించేందుకు పక్కా ప్లాన్ వేసుకుంది. సల్మాన్ ఖాన్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ "సికిందర్" చిత్రంలో నటిస్తోంది. ఇందులో రష్మిక మందన్న మరో హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి మురుగదాస్ దర్శకుడు. అలాగే "ఉమ" అనే మరో హిందీ చిత్రానికి కూడా కాజల్ కమిటైంది.
తమిళ ఇండస్ట్రీలోనూ కాజల్‌కు వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న "ఇండియన్ 3" చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు.. "కన్నప్ప" లో పార్వతి దేవిగా ఆమె కనిపించనుంది. ఇటీవల ఈ సినిమాలోని ఆమె లుక్ విడుదల కాగా, ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
ఇవే కాకుండా, కాజల్ "ద ఇండియన్ స్టోరీ" అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో శ్రేయస్ తల్పడే లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా 2025 ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. గతేడాది "సత్యభామ" తో ఆకట్టుకున్న కాజల్, ఈ ఏడాది మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు ఇండస్ట్రీల్లో బిజీగా ఉండి, యంగ్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూ, తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటోంది.
-
Home
-
Menu