మాల్దీవ్స్ లో చందమామ బర్త్ డే సెలబ్రేషన్స్

మాల్దీవ్స్ లో చందమామ బర్త్ డే సెలబ్రేషన్స్
X
మైల్ స్టోన్ బర్త్ డే వేడుకను ఆమె మాల్దీవుల్లో గ్రాండ్‌గా జరుపుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వర్షంలా కురిశాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎర్లియర్ గా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి 'సికందర్' సినిమాలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కానప్పటికీ, కాజల్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చలాకీతనం, గ్లామర్, నటనా నైపుణ్యం సినిమాకి సరికొత్త ఎనర్జీని తీసుకొచ్చాయి. తాజాగా, కాజల్ తన 40వ బర్త్‌డేని సూపర్ స్టైలిష్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

ఈ మైల్ స్టోన్ బర్త్ డే వేడుకను ఆమె మాల్దీవుల్లో గ్రాండ్‌గా జరుపుకుంది. అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వర్షంలా కురిశాయి. ఈ సందర్భంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాల్దీవుల్లోని వేడుకల నుంచి కొన్ని అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్‌లో ఆమె భర్త గౌతమ్ కిచ్లు, కొడుకు నీల్ కిచ్లు, సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి సముద్ర తీరంలో చిల్ అవుతూ, ఆనందంగా గడిపిన క్షణాలు కనిపిస్తాయి.

ఈ ఫోటోల్లో కాజల్ సముద్ర ఒడ్డున, నీలి నీటి నడుమ, సూర్యకాంతిలో మెరిసిపోతూ కనిపించింది. 40 ఏళ్ల వయసులోనూ ఆమె రేడియంట్ లుక్, గ్లామరస్ వైబ్, యూత్‌ఫుల్ ఎనర్జీ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆమె షేర్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ నుంచి "ఎవర్‌గ్రీన్ బ్యూటీ", "ఏజ్‌లెస్ క్వీన్" అంటూ కామెంట్స్ వచ్చి పడ్డాయి.

సినిమాల పరంగా కాజల్ ఇప్పుడు ఫుల్ బిజీ మోడ్‌లో ఉంది. ఆమె తదుపరిగా తెలుగు సినిమా 'కన్నప్ప'లో పార్వతిదేవి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అలాగే.. లెజెండరీ నటుడు కమల్ హాసన్‌తో 'ఇండియన్ 3' లోనూ ఆమె నటిస్తోంది. అదనంగా, హిందీలో 'ది ఇండియా స్టోరీ' అనే సినిమా కూడా ఆమె లైనప్‌లో ఉంది. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

Tags

Next Story