మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న చందమామ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఇప్పుడు తన కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. ‘కన్నప్ప’ , ‘ఇండియన్ 3’ , ‘ది ఇండియా స్టోరీ’, ‘రామాయణం: పార్ట్ 1’ లాంటి భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బీ అయినా, కాస్త బ్రేక్ తీసుకుని మాల్దీవులకు జెట్ సెట్ అయిపోయింది. తన 40వ బర్త్‌డే కి ఠీవీగా సిద్ధమవుతూ, ఈ బ్యూటీ బీచ్‌లో చిల్ మోడ్‌లో మునిగిపోయింది.
మాల్దీవుల బీచ్‌లో ఇసుకపై హెడ్‌స్టాండ్ చేస్తూ కాజల్ పోస్ట్ చేసిన ఫోటో ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యింది. పింక్ బ్రాలెట్, బ్లాక్ ప్యాంట్స్‌లో ఫిట్‌నెస్‌ను ఫ్లాంట్ చేస్తూ, బ్యాలెన్స్‌తో బాస్ లెవెల్ కాన్ఫిడెన్స్‌ను చూపించింది. ఈ ఫోటోలో ఆమె సిస్టర్ నిషా అగర్వాల్ కూడా కనిపించింది, చెట్టుకు ఆనుకుని కూల్‌గా పోజ్ ఇస్తూ. ఈ పిక్ సింపుల్‌గా ఉన్నా, దాని వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అభిమానులు, నెటిజన్లు అంతా ఈ ఫోటోని చూసి ఫ్లాట్ అయిపోయారు.
కాజల్ ఈ ఫోటోకి క్యాప్షన్ రాస్తూ, “బర్త్‌డేకి పర్ఫెక్ట్ కిక్‌స్టార్ట్” అని పెట్టింది. ఈ ఒక్క లైన్‌తోనే ఆమె ఎంత రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉందో అర్థమైపోయింది. జూన్ 19న 40వ పుట్టినరోజు జరుపుకోబోతున్న కాజల్‌కి ఫ్యాన్స్ నుంచి విషెస్, లవ్ ఫుల్ ఫ్లడ్ అయ్యింది కామెంట్స్ సెక్షన్‌లో. “ఫిట్‌నెస్ గోల్స్”, “క్వీన్ వైబ్స్” అంటూ కామెంట్స్‌తో రచ్చ రచ్చ చేశారు.
బిజీ షెడ్యూల్, బ్యాక్-టు-బ్యాక్ సినిమా షూటింగ్స్ మధ్యలో కూడా, ఈ బీచ్ గెట్‌అవే ద్వారా కాజల్ తన పర్సనల్ సైడ్‌ని చూపించింది. ఈ మాల్దీవుల ట్రిప్, ఆ హెడ్‌స్టాండ్ పిక్‌తో సోషల్ మీడియాలో ఫుల్ హైలైట్ అయ్యింది. కాజల్ ఈ సింపుల్ అండ్ బోల్డ్ మూమెంట్‌తో అందరి హార్ట్స్‌ని మళ్లీ గెలిచేసింది.
-
Home
-
Menu