‘జటాధర’ విడుదలయ్యేది అప్పుడే !

యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా జోడీగా రూపొందిన పౌరాణిక, భక్తిరస చిత్రం ‘జటాధర’. ఈ మూవీని ఈ ఏడాది నవంబర్ 7 న విడుదల చేయనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి.
వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ ఆధారిత సాంకేతికతతో కూడిన దృశ్యకావ్యంగా రూపొందుతోంది. పురాణాలను, భక్తి అంశాలను కలిపి నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను తీర్చిదిద్దారు.
ఈ చిత్రంలో సుధీర్ బాబు గతంలో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా, భారతదేశ వ్యాప్తంగా విస్తృత ప్రేక్షకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీ స్టూడియోస్ పతాకంపై ప్రేరణ అరోరా నిర్మించిన ఈ చిత్రానికి.. ‘రుస్తుం’ తర్వాత ఆమెకు జీ స్టూడియోస్‌తో ఇది రెండవ పెద్ద ప్రాజెక్ట్. ఇక, సోనాక్షి సిన్హాకు ఇది మొదటి తెలుగు చిత్రం కావడం విశేషం.
From the depths of darkness, the divine rises 💫#Jatadhara in theatres from Nov 7th 2025 in Telugu & Hindi 🪔 #JatadharaOnNOV7 🔱#Awakeningbegins#UmeshKrBansal #PrernaArora @zeestudiossouth @shivin7 #ArunaAgarwal #ShilpaSinghal @kejriwalakshay #RaveenaDeshpaande… pic.twitter.com/306nRa6jYP
— Zee Studios (@ZeeStudios_) September 15, 2025
-
Home
-
Menu