పారితోషికం అంత భారీగా పెంచేసిందా?

పారితోషికం అంత భారీగా పెంచేసిందా?
X
"దేవర" కోసం రూ. 5 కోట్లు తీసుకున్న ఆమె.. "పెద్ది" కోసం రూ. 1 కోటి ఎక్కువ అందుకుంది. ఇప్పుడు మరింత ఫీజు కోట్ చేస్తోందట.

జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ "దేవర" తో ఘనంగా ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు రామ్ చరణ్‌తో "పెద్ది" సినిమాలో నటిస్తోంది. సౌత్‌లో ఆమె పాపులారిటీ పీక్స్‌లో ఉండటంతో.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలోని భారీ ప్రాజెక్ట్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా సైన్ చేయలేదు.

డిమాండ్ ఎక్కువ కావడంతో జాన్వీ తన రెమ్యూనరేషన్‌ని పెంచేసింది. "దేవర" కోసం రూ. 5 కోట్లు తీసుకున్న ఆమె.. "పెద్ది" కోసం రూ. 1 కోటి ఎక్కువ అందుకుంది. ఇప్పుడు మరింత ఫీజు కోట్ చేస్తోందట. బాలీవుడ్‌లో జాన్వీకి ప్రస్తుతం పెద్ద హిట్‌లు లేవు. వరుణ్ ధవన్‌తో "సన్నీ సంస్కారీ కి తులసీ కుమారీ", సిద్ధార్థ్ మల్హోత్రాతో "పరమ్ సుందరీ" వంటి మిడ్-రేంజ్ హీరోల సినిమాలు మాత్రమే ఉన్నాయి.

ఏ-లిస్ట్ హిందీ స్టార్స్‌తో ఆమెకు ఇంకా చాన్స్ రాలేదు. దీంతో.. ఆమె ఫోకస్ తెలుగు బిగ్-టికెట్ సినిమాలపై పడింది. ఇవి ఆమెకు విశాలమైన రీచ్‌తో పాటు మంచి పారితోషికాన్ని అందిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్‌తో అట్లీ డైరెక్షన్‌లో రూమర్డ్ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్.

Tags

Next Story