తెలుగులో బిజీ అవుతోన్న జాన్వీ కపూర్!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టినరోజు (మార్చి 6) సందర్భంగా, ఆమె నటిస్తున్న ‘RC16‘ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ BTS ఫొటోలో జాన్వీ సింపుల్ లుక్‌లో కనిపిస్తూ, ఒక చేత్తో గొర్రె పిల్లను, మరో చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది. ఫ్యాన్స్ ఈ లుక్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.




దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ ఫోటోను షేర్ చేసి ‘జాన్వీ, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీ అద్భుతమైన పాత్రను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారో అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను‘ అంటూ బర్త్‌డే విషెష్ చెప్పాడు.

ఎన్టీఆర్ తో ‘దేవర‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జాన్వీ కపూర్ నటిస్తున్న రెండో తెలుగు చిత్రం RC16. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ రోల్ ను ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దాడట డైరెక్టర్ బుచ్చిబాబు. మరోవైపు త్వరలో పట్టాలెక్కే అల్లు అర్జున్ - అట్లీ మూవీలోనూ జాన్వీ కపూర్ నాయికగా నటించనుందనే ప్రచారం జరుగుతుంది.

Tags

Next Story