రాజమౌళి కోసం రంగంలోకి ‘అవతార్’ డైరెక్టర్?

రాజమౌళి కోసం రంగంలోకి ‘అవతార్’ డైరెక్టర్?
X
ఈ నవంబర్ రివీల్ వెనక భారీ కారణం ఉంది. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామరాన్, తన ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ (డిసెంబర్ 19న రిలీజ్) ప్రమోషన్స్ కోసం ఆ సమయంలో ఇండియా వస్తున్నారట. అప్పుడు కామెరాన్ ‘గ్లోబ్‌ట్రాటర్’ మూవీ టైటిల్.. ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించే అవకాశం ఉందని బజ్.

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా అంటే ఎప్పుడూ ఓ అద్భుతం. ‘బాహుబలి’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు ప్రతి సినిమాతో ఊహించని లెవెల్‌కి తీసుకెళ్లి, గ్లోబల్ స్థాయిలో భారతీయ సినిమాకి గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ అతడు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో అతడి కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆసక్తికరంగా, రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఏమీ బయటపెట్టలేదు. అధికారిక ప్రకటనలు, ప్రెస్ మీట్‌లు, లాంచ్ అప్‌డేట్స్ ఏవీ లేవు.

మహేష్ బాబు పుట్టినరోజు, ఆగస్టు 9న.. ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ లేదా టైటిల్ రివీల్ ఆశించారు. కానీ ఏమీ రాలేదు. బదులుగా, రాజమౌళి నవంబర్ 2025లో ఫస్ట్ లుక్ వస్తుందని ప్రకటించారు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఈ నవంబర్ రివీల్ వెనక భారీ కారణం ఉంది. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామరాన్, తన ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ (డిసెంబర్ 19న రిలీజ్) ప్రమోషన్స్ కోసం ఆ సమయంలో ఇండియా వస్తున్నారట. అప్పుడు కామెరాన్ ‘గ్లోబ్‌ట్రాటర్’ మూవీ టైటిల్.. ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించే అవకాశం ఉందని బజ్.

ఈ కాంబోకి మరింత బలం ఇస్తూ, కామెరాన్ గతంలో రాజమౌళిని బాగా పొగిడారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఓ అవార్డ్స్ ఈవెంట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ని మెచ్చుకుంటూ, “ఇక్కడ సినిమా చేయాలనుకుంటే, మాట్లాడదాం” అని రాజమౌళికి చెప్పారు. ఆ సంభాషణ వైరల్ అయింది. ఇద్దరి మధ్య పరస్పర గౌరవాన్ని చూపించింది.

కామెరాన్ నిజంగా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తే, ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా గ్లోబల్ రాడార్‌లోకి వస్తుంది. భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రాజమౌళికి ఇది మరో అడుగు. మహేష్ బాబుకి, ప్రపంచ సినిమాలో అతిపెద్ద పేరుతో తన సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం అరుదైన గౌరవం. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే, నవంబర్‌లో రాజమౌళి కొత్త సినిమాకి మొదటి అంతర్జాతీయ హైప్ స్టార్ట్ అవుతుంది.

Tags

Next Story