సహజ నటనతో ఆకట్టుకున్న జాబిలి

X
నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమా చూసిన వారికి బాగా గుర్తుండే పాత్రల్లో జాబిలి ఒకటి. ఆ పాత్రలో కనిపించింది శ్రీదేవి. ఈ సినిమాకి ముందు వరకూ ఆమె ఎవరికీ పెద్దగా తెలీదు. అయితే ఈ చిత్రంలో ఆమె సహజ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికీ.. ‘కోర్ట్‘ ఈ అమ్మాయికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ రీల్స్ చేస్తుండగా శ్రీదేవికి ఈ మూవీలో నటించే ఛాన్స్ వచ్చిందట. అలా తొలి ప్రధాన పాత్రలోనే ‘జాబిలి’గా హావభావాలతో కట్టిపడేసింది.
ముఖ్యంగా, కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె భావోద్వేగాన్ని ప్రదర్శించిన విధానం ఎంతో సహజంగా అనిపించిందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ‘కోర్ట్‘ మూవీలో శివాజీ, ప్రియదర్శి తర్వాత నటన పరంగా ఎక్కువ మార్కులు ఈ అమ్మాయికే దక్కుతున్నాయి.
Next Story
-
Home
-
Menu