ఈ సినిమా పూజా హెగ్డే కెరీర్‌కు అంత కీలకమా?

ఈ సినిమా పూజా హెగ్డే కెరీర్‌కు అంత కీలకమా?
X


తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో అనేక అపజయాలను ఎదుర్కొన్న పూజా హెగ్డే.. తన కొత్త ప్రాజెక్టుల ద్వారా తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చే ఆశతో ఉంది. ఆమె లేటెస్ట్ హిందీ చిత్రం "దేవా" డిజాస్టర్ అవడంతో ఈ నిరాశ మరింత పెరిగింది. అయితే, ఆమెకు ఇప్పుడు కోలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే తమిళంలో విజయ్ సరసన "జన నాయకన్", సూర్యతో "రెట్రో" చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాక, రాఘవ లారెన్స్ హిట్ హారర్ సిరీస్‌లో కొత్త సినిమాగా రాబోతున్న "కాంచన 4" చిత్రానికి కూడా ఆమె అంగీకరించిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ వినూత్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు కాంచన సిరీస్‌లో తాప్సీ, రాయ్ లక్ష్మీ, నిత్యామీనన్ వంటి హీరోయిన్లు తమ పాత్రల ద్వారా మంచి గుర్తింపు పొందారు. కాబట్టి.. ఈ సినిమా ద్వారా పూజా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

‘కాంచన 4’ భారీ విజయం సాధిస్తే.. పూజా హెగ్డేకు మళ్లీ మునుపటి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. హారర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉండటంతో పాటు, ఆమె పోషించే పాత్రలో నటనకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నందున.. ఇది ఆమె కెరీర్‌కు కీలక మలుపు కావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారి పూజా హెగ్డే తన ప్రతిభను నిరూపించుకుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags

Next Story