‘జాట్’ తెలుగులో రిలీజ్ అవుతోందా? లేదా?

‘జాట్’ తెలుగులో రిలీజ్ అవుతోందా? లేదా?
X
తొలుత దీనిని తెలుగులో కూడా అదే రోజు విడుదల చేయాలని మేకర్లు ప్రకటించినా.. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు తెలుగు వెర్షన్‌ను ఏప్రిల్ 10న విడుదల చేయడం లేదని టాక్.

సన్నీ డియోల్ తొలిసారిగా తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, టాలీవుడ్ కు చెందిన ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అయిన సన్నీ డియోల్, 1980లలో తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి బ్లాక్‌బస్టర్ హిట్లను అందిస్తూ వస్తున్నారు. "ఘాయల్," "ఘాటక్," "దర్," "బార్డర్," "గదర్: ఒక ప్రేమ కథ" అండ్ "గదర్ 2" వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆయన సినీ ప్రయాణంలో అద్భుత విజయాలు సాధించాయి.

ఇటీవల విడుదలైన "గదర్ 2" హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలన విజయం సాధించింది. ఈ విజయం చూసిన తర్వాత... తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సన్నీ డియోల్‌కి రికార్డ్ స్థాయి పారితోషికం ఇచ్చి "జాట్" అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

"జాట్" అనే ఈ ప్యాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025, ఏప్రిల్ 10న విడుదల కానుంది. తొలుత దీనిని తెలుగులో కూడా అదే రోజు విడుదల చేయాలని మేకర్లు ప్రకటించినా.. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు తెలుగు వెర్షన్‌ను ఏప్రిల్ 10న విడుదల చేయడం లేదని టాక్. బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్‌ని మన తెలుగు దర్శకుడి దర్శకత్వంలో చూడబోతున్న ఈ సినిమా ఏ రేంజ్‌లో దూసుకెళ్తుందో చూడాలి.

Tags

Next Story