నక్కిన-బెల్లంకొండ మాస్ ఎంటర్‌టైనర్ రాబోతుందా?

నక్కిన-బెల్లంకొండ మాస్ ఎంటర్‌టైనర్ రాబోతుందా?
X

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న లిస్టులో నక్కిన త్రినాథరావు పేరును కూడా ప్రస్తావించాలి. 'మేము వయసుకి వచ్చామ్, సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా' వంటి డీసెంట్ హిట్స్ అతని ఖాతాలో ఉన్నాయి. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'మజాకా' కూడా మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో దూసుకెళ్తుంది.

'మజాకా' తర్వాత నక్కిన సినిమా ఏంటి? అనే దాని గురించి చర్చ జరుగుతుంది. నక్కిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను దిల్‌రాజు బ్యానర్ లో చేయబోతున్నాడట. ఇప్పటికే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి ఒక కథ చెప్పాడట. అది అతనికి కూడా నచ్చడంతో.. బెల్లంకొండ-నక్కిన కాంబో ఫిక్స్ అనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది.

మరోవైపు ప్రస్తుతం 'భైరవం'ను విడుదలకు ముస్తాబు చేస్తోన్న బెల్లంకొండ.. 'టైసన్ నాయుడు, హైందవ' వంటి సినిమాలతోనూ బిజీగా ఉన్నాడు. మరి.. బెల్లంకొండ-నక్కిన కాంబోపై త్వరలోనే ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి

Tags

Next Story