కూతురితో విభేదాలు – కల్పన అనారోగ్యానికి కారణమా?

సింగర్ కల్పన అనారోగ్య ఘటన కొత్త చర్చలకు దారి తీసింది. కొంతమంది భావించినట్లుగా ఇది ఆత్మహత్యాయత్నం కాదని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె అనుకోకుండా అపస్మారక స్థితికి వెళ్లినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
కల్పన గత ఐదేళ్లుగా తన భర్త ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఓ విల్లాలో నివసిస్తున్నారు. వారి కుమార్తె దయ ప్రసాద్ చదువు విషయంలో ఆమెతో విభేదించింది. ఈ చిన్న తగాదా తల్లీ, కూతుళ్ల మధ్య పెద్ద మనస్పర్థలకు దారి తీసింది. కుటుంబ సమస్యల కారణంగా కల్పన తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది.
ఈ సంఘటన జరగడానికి ముందు కల్పన తన కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయినట్లు సమాచారం. ఆమె భర్త ప్రసాద్ పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆయన కాలనీ వెల్ఫేర్ సభ్యులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలియజేశారు.
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసులు, కాలనీ సభ్యులు కలిసి కల్పన ఇంటి తలుపులు తట్టారు. ఆమె నుంచి స్పందన రాకపోవడంతో, వెనుక కిచెన్ డోర్ ద్వారా లోపలికి ప్రవేశించారు. బెడ్‌రూమ్‌లో అపస్మారకంగా పడిపోయిన కల్పనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
-
Home
-
Menu