నంది అవార్డులపై పరిశ్రమ అభ్యర్థనలు!

నంది అవార్డులపై పరిశ్రమ అభ్యర్థనలు!
X

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్‌లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రముఖ నిర్మాతలు, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే నిర్మాతలు, కళాకారులు, సాంకేతిక నిపుణుల కోసం గృహనిర్మాణ భూమి కేటాయింపు వంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించారు.

అంతేకాకుండా, నంది అవార్డులను పునరుద్ధరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అవార్డులను ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ ప్రతిపాదనలతో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలపడేందుకు దారితీస్తుందని తెలిపుతూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున ప్రెస్ నోట్ జారీ చేసారు గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్.

Tags

Next Story