తిరిగి ‘ఓజీ’ సెట్స్ లోకి ఇమ్రాన్ హష్మి

తిరిగి ‘ఓజీ’ సెట్స్ లోకి ఇమ్రాన్ హష్మి
X
ఇమ్రాన్ హష్మి మాత్రం ఇటీవల డెంగ్యూ జ్వరం కారణంగా లేటెస్ట్ షెడ్యూల్‌లో పాల్గొనలేకపోయాడు. అయితే.. ఇప్పుడు ఫుల్‌గా రికవర్ అయి, బ్యాక్ టు యాక్షన్ మోడ్‌లో సెట్స్‌పైకి అడుగు పెట్టాడు.

బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి టాలీవుడ్ లోకి స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "ఓజీ" అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాతో ఇమ్రాన్ తెలుగు డెబ్యూ చేస్తున్నాడు. ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ ట్రాక్‌పైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం రీసెంట్‌గా సెట్స్‌పై జాయిన్ అయ్యాడు.

ఇమ్రాన్ హష్మి మాత్రం ఇటీవల డెంగ్యూ జ్వరం కారణంగా లేటెస్ట్ షెడ్యూల్‌లో పాల్గొనలేకపోయాడు. అయితే.. ఇప్పుడు ఫుల్‌గా రికవర్ అయి, బ్యాక్ టు యాక్షన్ మోడ్‌లో సెట్స్‌పైకి అడుగు పెట్టాడు. "ఓజీ"లో ఇమ్రాన్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు, ఇది అతని కెరీర్‌లో ఓ కీలకమైన మలుపు అని చెప్పొచ్చు. అంతేకాదు.. ఇమ్రాన్ అడివి శేష్ హీరోగా నటిస్తున్న "గూఢచారి 2" లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇది ఇంకో బిగ్ బ్రేక్.

ఒకప్పుడు బాలీవుడ్‌లో "మర్డర్", "గ్యాంగ్‌స్టర్", "జన్నత్" లాంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. ఆ రొమాంటిక్, థ్రిల్లర్ వైబ్‌తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇమ్రాన్, ఇప్పుడు తెలుగు సినిమాలతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. "ఓజీ, గూఢచారి 2"తో సౌత్‌లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. "ఓజీ" సినిమా సెప్టెంబర్ 2025లో థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. మరి ఇమ్రాన్ హష్మి ఈ కొత్త జర్నీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Tags

Next Story