అల్లు- అట్లీ కాంబో మూవీకి అదే టైటిలా?

అల్లు- అట్లీ కాంబో మూవీకి అదే టైటిలా?
X
అల్లు అర్జున్ తనకు ఎంతో ఇష్టమైన "ఐకాన్" అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు.

‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో క్రేజీ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక అదిరిపోయే సినిమాలో నటించే సన్నాహాల్లో ఉన్నాడు బన్నీ. ఈ ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

అల్లు అర్జున్ తనకు ఎంతో ఇష్టమైన "ఐకాన్" అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ టైటిల్‌కు అల్లు అర్జున్‌కు ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్, అల్లు అర్జున్‌తో కలిసి "ఐకాన్" అనే టైటిల్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నీరుగారిపోయింది. అయిన ప్పటికీ, "ఐకాన్" టైటిల్‌పై అల్లు అర్జున్‌కు ఉన్న ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ఈ టైటిల్ అతనికి అంతగా నచ్చడంతో, అతను తన స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌లైన్‌ను "ఐకాన్ స్టార్"గా మార్చుకున్నాడు. ఈ టైటిల్‌పై అతనికి ఉన్న ప్రేమ మరియు ఆప్యాయతను ఇది స్పష్టంగా తెలియజేస్తుంది.

ఇప్పుడు, ఈ "ఐకాన్" టైటిల్‌ను అట్లీతో చేస్తున్న తన కొత్త సినిమాకు ఉపయోగించాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఈ విషయాన్ని అతను డైరెక్టర్ అట్లీతో పాటు చిత్ర నిర్మాతలతో కూడా చర్చించాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమాకు "ఐకాన్" అనే టైటిల్ అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది. ఈ టైటిల్ హక్కులను నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ నుండి పొందడం అల్లు అర్జున్‌కు పెద్ద సవాలుగా అనిపించకపోవచ్చు. మరి అల్లు అట్లీ కాంబోమూవీకి ఈ టైటిలే ఫిక్స్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

Tags

Next Story