‘ది ప్యారడైస్’ కోసం హాలీవుడ్ మార్కెటింగ్ కంపెనీ !

నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం “ది ప్యారడైస్”. ఈ మూవీ టీమ్ కేవలం పాన్-ఇండియా మార్కెట్‌ను మాత్రమే టార్గెట్ చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా రీచ్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్‌లోని కనెక్ట్‌మోబ్‌సీన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఇ. విస్కాంటితో టీమ్ సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, ఈ చర్చలు “ది ప్యారడైస్” చిత్రాన్ని నిజంగా అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌గా మారే అవకాశాన్ని సూచిస్తున్నాయి.
అదే సమయంలో, ఈ చిత్రం అంతర్జాతీయ రిలీజ్ కోసం ఒక టాప్ హాలీవుడ్ నటుడితో టీమ్ అడ్వాన్స్‌డ్ చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇది ఖరారైతే, ప్రాజెక్ట్ యొక్క గ్లోబల్ స్టేటస్ మరింత ఎలివేట్ అవుతుంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.
మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న “ది ప్యారడైస్” తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ వంటి ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో నానీ హీరోగా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
-
Home
-
Menu