వీఎఫ్ఎక్స్ కోసం రంగంలోకి హాలీవుడ్ కంపెనీ

వీఎఫ్ఎక్స్ కోసం రంగంలోకి హాలీవుడ్ కంపెనీ
X
తాజా సమాచారం ప్రకారం, అద్భుతమైన క్వాలిటీతో వీఎఫ్‌ఎక్స్ ను అందించడం కోసం, బడ్జెట్‌ను మించినా సరే... ప్రాజెక్ట్‌ను హాలీవుడ్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీకి అప్పగించారు.

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట రూపొందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. వీఎఫ్‌ఎక్స్ సమస్యల కారణంగా పదేపదే ఆలస్యం అవుతోంది. అనౌన్స్‌మెంట్ టీజర్‌కు నెగటివ్ రెస్పాన్స్ రావడం, మెగా ఫ్యాన్స్ కూడా వీఎఫ్‌ఎక్స్ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, చిత్ర బృందం వీఎఫ్‌ఎక్స్‌పై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.

తాజా సమాచారం ప్రకారం, అద్భుతమైన క్వాలిటీతో వీఎఫ్‌ఎక్స్ ను అందించడం కోసం, బడ్జెట్‌ను మించినా సరే... ప్రాజెక్ట్‌ను హాలీవుడ్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీకి అప్పగించారు. ‘విశ్వంభర’ ఒక సోషియో-ఫాంటసీ చిత్రం కావడంతో, దీనికి విస్తృతమైన వీఎఫ్‌ఎక్స్ అవసరం. ఈ జానర్‌లో నీరసమైన వీఎఫ్‌ఎక్స్ ఉంటే విడుదల తర్వాత తీవ్ర విమర్శలు రావచ్చు. అందుకే, బృందం అదనపు సమయం తీసుకుని, బెస్ట్ ఔట్ పుట్ అందించాలని నిర్ణయించింది. దీని కోసం రిలీజ్‌ మరింత ఆలస్యం అయినా పర్వాలేదని డిసైడయ్యారు మేకర్స్.

హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ త్వరలో తమ పనిని పూర్తి చేస్తుందని.. ఆ తర్వాతే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. చిరంజీవి ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘బింబిసార’ వంటి విభిన్న సోషియో-ఫాంటసీ హిట్ చిత్రాన్ని రూపొందించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో.. ‘విశ్వంభర’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కథాంశం గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. అయినప్పటికీ, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ స్థాయిలో ఈ చిత్రం గ్రాండ్‌గా ఉంటుందని నిర్మాతలు మెగా ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు. మరి ‘విశ్వంభర’ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Tags

Next Story