‘హిట్’ సిరీస్ లో ఎన్ని సినిమాలొస్తాయి?

“హిట్” ఫ్రాంచైజ్ మొదటి భాగంలో విశ్వక్సేన్ హీరోగా నటించాడు. రెండో భాగానికి అడివి శేష్ నాయకుడిగా వ్యవహరించగా, ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న మూడో భాగంలో నాని ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూడూ భాగాల్లో కథానాయకులు మారినా, నిర్మాతలు నాని, ప్రశాంతి తిపిరినేని, దర్శకుడు శైలేష్ కొలను మాత్రం అన్నీ భాగాలకు కామన్‌గా కొనసాగారు.
ఇక “హిట్ 3” క్లైమాక్స్ లో నాలుగో భాగానికి బలమైన లీడ్ ఇవ్వడంతో పాటు, ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ “హిట్ 4”లో పోలీసాఫీసర్ వీరప్పన్‌గా కనిపించ నున్నట్లు ప్రకటించారు. కార్తీ ప్రస్తుతం “ఖైదీ 2” వంటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉండటంతో.. “హిట్ 4” 2026లో ప్రారంభం కానుంది.
ఇక ఈ హిట్ సిరీస్ కు సంబంధించిన అసలైన అప్డేట్ ఏంటంటే.. నానీ, దర్శకుడు శైలేష్ కొలను ఈ ఫ్రాంచైజ్‌ను ఐదవ భాగంతో ముగించాలనే నిర్ణయం తీసుకున్నారు. “హిట్ 5” లో ఓ ప్రముఖ సీనియర్ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. మరి ఆ హీరో ఎవరన్నది అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేపుతోంది.
-
Home
-
Menu