హైకోర్టు తీర్పు.. 16 ఏళ్ల లోపు పిల్లలకు అన్ని షోలకు అనుమతి!

హైకోర్టు తీర్పు.. 16 ఏళ్ల లోపు పిల్లలకు అన్ని షోలకు అనుమతి!
X

తెలంగాణ హైకోర్టు తాజాగా 16 సంవత్సరాల లోపు పిల్లల థియేటర్ ప్రవేశంపై విధించిన పరిమితులను సవరించింది. గతంలో, రాత్రి 11 గంటల తర్వాత చిన్నారులను థియేటర్లలోకి అనుమతించకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా, ఇప్పుడు ఆ నిబంధనను సవరించి అన్నీ షోలకు అనుమతి ఇచ్చింది. అయితే, ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోల విషయంలో మాత్రం కోర్టు వెనకడుగు వేసింది.

ఈ మార్పులకు పునాదిగా మారిన ఘటనల్లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలో సంభవించిన తొక్కిసలాట ఒకటి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ తెల్లవారుఝామున బెనిఫిట్ షోలను నిషేధించాలంటూ కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

అయితే, థియేటర్ల వ్యాపారంపై ఈ పరిమితులు ప్రభావం చూపిస్తున్నాయని మల్టీప్లెక్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో, తెలంగాణ హైకోర్టు తాజా సవరణ ఉత్తర్వులు జారీ చేస్తూ పిల్లలకు టైమింగ్ పరిమితులు లేకుండా థియేటర్ ప్రవేశం కల్పించింది. కానీ, ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోల నిషేధాన్ని కొనసాగిస్తూ, తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

Tags

Next Story