హిట్టంటే ఏంటో తెలియని ముద్దుగుమ్మ !

హిట్టంటే ఏంటో తెలియని ముద్దుగుమ్మ !
X
రొమాంటిక్ తర్వాత నాగ శౌర్యతో 'లక్ష్య', వైష్ణవ్ తేజ్‌తో 'రంగరంగ వైభవంగా' వంటి ప్రాజెక్టుల్లో ఛాన్స్‌లు వచ్చాయి. కానీ వరుసగా మూడు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, కేతిక ప్లాప్‌ల హ్యాట్రిక్ అందుకుంది.

డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించి తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీతో కలిసి నటించిన 'రొమాంటిక్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఆమెకి యాక్టింగ్, గ్లామర్ పరంగా మంచి మార్కులే వచ్చాయి. కానీ కమర్షియల్ విజయం మాత్రం అందలేదు. ఆ తర్వాత నాగ శౌర్యతో 'లక్ష్య', వైష్ణవ్ తేజ్‌తో 'రంగరంగ వైభవంగా' వంటి ప్రాజెక్టుల్లో ఛాన్స్‌లు వచ్చాయి. కానీ వరుసగా మూడు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, కేతిక ప్లాప్‌ల హ్యాట్రిక్ అందుకుంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న 'బ్రో' కూడా ఆమెకు అంతగా ఫేమ్ తెచ్చిపెట్టలేకపోయింది.

తెలుగులో నిరాశ ఎదురవడంతో బాలీవుడ్‌లో ట్రై చేయాలని నిర్ణయించుకుంది. కానీ అక్కడ కూడా ఫలితం అదే. ఒక సినిమాకి తరువాత ఇంకో ఆఫర్ రాలేదు. ఇదే సమయంలో 'రాబిన్ హుడ్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. స్పెషల్ నంబర్లతో కొందరు హీరోయిన్లు పాపులారిటీ తెచ్చుకున్నట్లే తనకి కూడా క్రేజ్ వస్తుందనుకుని చేసిన ఈ స్టెప్పులు ఆమెకి పెద్ద కాంట్రవర్సీని తీసుకొచ్చాయి. హుక్ స్టెప్పులపై మహిళా కమిషన్ నుంచి వార్నింగ్ రావడం ఆమెకి ఊహించని షాక్ అయింది. ఈ స్పెషల్ సాంగ్ కూడా ఆమె కెరీర్‌ని ఎత్తుకు తీసుకెళ్లలేదు.

ప్రస్తుతం కేతిక చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి శ్రీ విష్ణుతో కలిసి నటిస్తున్న 'సింగిల్' మూవీ. ఇందులో ఆమెతో పాటు 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మరోవైపు, తమిళ హిట్ సినిమాలు ‘తూంగవనమ్, కేకే’ చిత్రాల దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వ రూపొందిస్తున్న ఓ బైలింగ్వల్ ప్రాజెక్టులో నటిస్తోంది. ఇందులో లీడ్ రోల్ మాత్రం అదితి రావు హైదరీ చేస్తోంది. మరి ఈ బ్యూటీ హిట్టు ముఖం ఎప్పుడు చూస్తుందో వెయిట్ చేయాలి.

Tags

Next Story