నాకు మరో పదేళ్ళ కెరీర్ ఉంది : హెబ్బా పటేల్

నాకు మరో పదేళ్ళ కెరీర్ ఉంది : హెబ్బా పటేల్
X
టాలీవుడ్‌లో తన పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తుపై ఎంతో ఉత్సాహంగా ఉంది.

2015లో విడుదలైన 'కుమారి 21ఎఫ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది హెబ్బా పటేల్ . ఆ సినిమా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. గత దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో అనేక విభిన్న పాత్రలను పోషించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. టాలీవుడ్‌లో తన పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఆమె భవిష్యత్తుపై ఎంతో ఉత్సాహంగా ఉంది. త్వరలో విడుదలకానున్న 'ఓదెల 2' లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

"ఓదెల రైల్వే స్టేషన్' మర్డర్ మిస్టరీ కాగా, 'ఓదెల 2' ఒక సూపర్‌నేచురల్ థ్రిల్లర్" అని హెబా వెల్లడించింది. "మొదటి భాగంలో నేను ప్రధాన పాత్రలో నటించాను. ఈ సీక్వెల్‌లో తమన్నా భాటియా నా అక్కగా కనిపించనున్నారు. కథలో ఆమె పాత్ర కీలకమైనదే అయినా, నా పాత్ర కూడా చాలా బలమైనదిగా ఉంటుంది. ఈసారి 'ఓదెల 2' మరింత భారీ స్థాయిలో తెరకెక్కింది. ‘కుమారి 21ఎఫ్’ నాకు పేరు తెచ్చిపెట్టింది, కానీ 'ఓదెల' నటిగా నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఆ సినిమాతో నాకు విభిన్నమైన పాత్రలను చేయగలననే నమ్మకం వచ్చింది" అని హెబ్బా తెలిపింది.

"ఈ పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఒక నటిగా నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను. విజయమో, పరాజయమో తుదిశాసనం కాదు. ప్రతి అనుభవం నాకు నేర్పిందేమో కొత్త విషయమే. మరో పదేళ్లు ఈ పరిశ్రమలో కొనసాగుతానన్న నమ్మకం నాకు ఉంది" అని ఆమె అన్నారు.తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ, "నా తరువాతి టార్గెట్ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ చేయడం" అని హెబ్బా పటేల్ అభిప్రాయ పడింది.

Tags

Next Story